ధర్మపురిలో ఘనంగా పోషణ్ మాస కార్యక్రమం!

J.SURENDER KUMAR,


మహిళా అభివృద్ధి మరియు శిక్ష సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 9వ పోషణ్ మాసం కార్యక్రమం మంగళవారం ధర్మపురి ప్రాజెక్టులో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ వేముల నాగలక్ష్మి  పాల్గొన్నారు.

పోషకాహారం యొక్క ప్రాముఖ్యత మరియు కుటుంబంలో ఒక విద్యావేత్త , ఆరోగ్యవంతమైన తల్లి ఉంటే కుటుంబం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అదేవిధంగా జగిత్యాల డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ ఆడెపు భాస్కర్  పోషణ మాసం యొక్క ప్రాముఖ్యతను వివరించారు.

ధర్మపురి ప్రాజెక్ట్ సిడిపిఓ వాణి శ్రీ  ప్రతి కుటుంబం సమతుల్య ఆహారం తీసుకుంటూ పోషణ లోపం లేని సమాజాన్ని నిర్మించాలని తెలిపారు. ధర్మపురి ప్రాజెక్ట్ ఏసి డి పి ఓ మౌనిక  గర్భిణీ మరియు బాలింత సమతుల్యా ఆహారం తీసుకుంటూ పిల్లల శారీరక మానసిక ఎదుగుదలకు కృషి చేయాలని చెప్పారు.

ఈ కార్యక్రమంలో  కౌన్సిలర్లు సంగీ ఆనంద్, ఒజ్జల లక్ష్మణ్ , చీపిరి చెట్టి రాజేష్, ముడుసుల ప్రశాంత్, వివిధ సెక్టార్ సూపర్వైజర్లు ,అంగన్వాడి టీచర్లు, ఆయాలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.