నవరాత్రి ఉత్సవ కరపత్రం ఆవిష్కరించిన మంత్రిఅడ్లూరి!

J.SURENDER KUMAR,


ధర్మపురి పట్టణంలోని న్యూ టి.టి.డి కళ్యాణ మండపం (బస్టాండ్ పక్కన) వేదికగా నవదుర్గా సేవా సమితి నిర్వహించనున్న త్రయోదశ (13వ) సంవత్సర దేవి శరన్నవరాత్రోత్సవాల ఆహ్వాన పత్రికను  మంగళవారం మంత్రి క్యాంప్ కార్యాలయం లో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్  ఆవిష్కరించారు.


ఈ సందర్భంగా మంత్రి వర్యులు మాట్లాడుతూ అమ్మ దయ తో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ అక్టోబర్ 11, 2026 నుండి అక్టోబర్ 20, 2026 వరకు ఈ నవరాత్రోత్సవాలు అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో జరగనున్నాయని తెలిపారు.


👉 ఆలయానికి కమ్యూనిటీ హాల్ మంజూరు చేయండి!


తీగల ధర్మారంలోని శ్రీ దుర్గా మాత ఆలయానికి కమ్యూనిటీ హాల్ రేకుల షెడ్డు మంజూరు ఇప్పించగలరని తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులను అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు విజ్ఞప్తి చేశారు.
శ్రీ దుర్గా మాత ఆలయం పురాతనమైన ఆలయము ధర్మపురి మండలంలో ఏకైక ఆలయం తీగల ధర్మారంలోని శ్రీ దుర్గా మాత ఆలయానికి కమ్యూనిటీ హాల్ మంజూరు ఇప్పించగలరని విజ్ఞప్తి చేశారు.

మంత్రిని కలిసిన వారిలో  సర్పంచ్ పందిరి అశోక్, మాజీ సర్పంచులు జంగిలి ప్రభాకర్, పందిరి తిరుపతి, ఆలయ కమిటీ చైర్మన్ జంగిలి రవీందర్ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు