ధర్మపురిలో మూడు రోజుల పాటు ధ్యాన శిక్షణ !

👉 ఈ నెల 5, 6, 7 తేదీలలో …!


👉 ధర్మపురి బ్రాహ్మణ సంఘ భవనంలో…!


    J.SURENDER KUMAR,


ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురిలో మూడు రోజులపాటు
ధ్యాన శిక్షణ కార్యక్రమం జరగనున్నది. హార్టుఫుల్నెస్ మరియు శ్రీరామచంద్ర మిషన్ ( కాన్హా శాంతివనం, హైద్రాబాద్)  ఆధ్వర్యంలో కొనసాగనున్నది.


ప్రతిరోజు సాయంత్రం 5-30  గంటల నుండి 7 గంటల వరకు ధ్యాన శిక్షణ  కొనసాగుతుంది. 18 సంవత్సరాల వయస్సు పైబడిన వారు  ధ్యాన శిక్షణ లో పాల్గొనడానికి అర్హులు అని  పేర్కొన్నారు.


రిటైర్డ్ ఎస్బిఐ బ్యాంక్ మేనేజర్  వి. ఎస్. ఆర్ లక్ష్మీ నారాయణ శాస్త్రి,  ధాన్య శిక్షణ వల్ల ప్రయోజనం మానసిక ప్రశాంతత తదితర అంశాలతో వివరించనున్నారు. ఈ మేరకు నిర్వాహకులు శనివారం ధర్మపురి మంత్రి లక్ష్మణ్ కుమార్, క్యాంపు కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరించారు.