👉 పూజలో పాల్గొన్న మంత్రి లక్ష్మణ్ కుమార్ !
J . SURENDER KUMAR
ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ అనుబంధం శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం “దసరా నవరాత్రోత్సవములు” వైభవముగా ఆరంభమయ్యాయి. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మొదటి రోజు అంకురార్పణ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఉదయము వేదపండితులు, ఋత్వికులచే మహ సంకల్పము, పృద్వీకలశ, గణపతి పూజ, స్వస్తిఃపుణ్యహ వచనము, ఋత్విక్ వర్ణణము, అఖండ దీప స్థాపన, నవగ్రహ, వాస్తు, క్షేత్ర పాలక, యోగిని, అంకురారోపణ, మాతృక, సర్వతోభద్ర మండల పూజలతో ప్రధాన కలశ స్థాపనలు. ఇందులో భాగంగా సప్తశతీ పారాయణము, అమ్మ వారికి చతుషష్టి పూజ, శ్రీచక్రమునకు కుంకుమార్చన, హారతి, మంత్రపుష్పము, తీర్ధప్రసాద వితరణలు జరిగాయి. ఐదు (5) ఋత్సికులచే “చండీపారాయణం” & “దేవిభాగవత పారాయణం”, కన్యకా, సువాసిని పూజలు నిర్వహించారు..ఈ రోజు అమ్మ వారు “శైలపుత్రి” ఎరుపు రంగు చీరలో మల్లెపూలు, బిల్వపత్రి దండలు దరించి భక్తులకు దర్శనం ఇచ్చినది.

కార్యక్రమంలో కార్యనిర్వహణాదికారి సంకటాల శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్ వేముల నాగలక్ష్మీరాజేష్ దంపతులు, మాజీ దేవస్థాన అధ్యక్షులు జక్కు రవీందర్, వేదపండితతులు బొజ్జ రమేష్ శర్మ. పాలెపు ప్రవీణ్ శర్మ, ఓంకార్ శర్మ, ఋత్వికులు తాడూరి బలరాంశర్మ, అలువాల కృష్ణ శర్మ, భరత్ శర్మ, ఉప ప్రధాన అర్చకులు నేరళ్ళ శ్రీనివాసాచార్యులు, సూపరింటెండెంట్ ఎ. శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్ వి.తిరుపతి, మున్నిపల్ కౌన్సిలర్ ఒజ్జల లక్ష్మణ్, చీపిరిశెట్టి రాజేష్, అర్చకులు నేరళ్ళ విజయ్. సముద్రాల వంశీ, చక్రపాణి కిరణ్ కుమర్, అభిషేక పురహితులు బొజ్జ రాజగోపాల్ శర్మ మరియు అర్చకులు & సిబ్బంది, ఋత్వికులు పాలెపు సందీప్ శర్మ, మరియు ఇతర ప్రముఖులు, భక్తులు. గ్రామస్తులు పాల్గోన్నారు.

👉 మంత్రి లిఫ్ట్ ప్రమాద వార్తలు అవాస్తవం..!
జగిత్యాల జిల్లా కేంద్రంలోనీ బాంకెట్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎక్కిన లిఫ్ట్ ప్రమాదానికి గురై మంత్రి గాయాలపాలు అయ్యారని పలు సోషల్ మీడియా మరియు ప్రచార మాధ్యమాల్లో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. అని మంత్రి కార్యాలయం నుండి జారీ చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
మంత్రి ఎటువంటి లిఫ్ట్ ప్రమాదానికి గురికాలేదు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు.ఎటువంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు అని మంత్రి వ్యక్తిగత సహాయకుడు సంగి సాయి కిరణ్ ప్రకటనలో పేర్కొన్నారు.
