నేడు ధర్మపురి మున్సిపల్ లో బతుకమ్మ వేడుకలు !


👉 ముఖ్య అతిథిగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,


తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ  వేడుకలను ధర్మపురి మున్సిపల్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో సాయంత్రం 6 గంటలకు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్యఅతిథిగా రానున్నారని, చైర్ పర్సన్ వేముల నాగలక్ష్మి, కమిషనర్ మామిడాల శ్రీనివాసరావు ప్రకటనలో తెలిపారు.

ధర్మపురి పట్టణంలోని మహిళా సోదరీమణులందరూ సంప్రదాయ బతుకమ్మలతో ఈ వేడుకల్లో పాల్గొని, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని చాటుతూ పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని  మహిళలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని  ప్రకటనలో పేర్కొన్నారు.