👉 చైర్‌పర్సన్ శ్రీమతి వేముల నాగలక్ష్మి !
J.SURENDER KUMAR,
జాతిపిత మహాత్మా గాంధీజీ జయంతిని పురస్కరించుకొని ధర్మపురి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో గాంధీ చౌక్ వద్ద శుక్రవారం మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా జరిగాయి. స్థానిక మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి వేముల నాగలక్ష్మి ఆధ్వర్యంలో, కమిషనర్ మామిళ్ల శ్రీనివాసరావు
తదితరులు గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
👉 ఈ సందర్భంగా చైర్‌పర్సన్ నాగలక్ష్మి మాట్లాడుతూ…
మహాత్మా గాంధీజీ సత్యం, అహింస, శాంతి, ఐక్యత, పరిశుభ్రత మరియు ప్రజాసేవకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. అహింసా మార్గంలో దేశ స్వాతంత్ర్యం కోసం గాంధీజీ చేసిన పోరాటం, ఆయన చూపిన సత్యం మరియు నైతిక విలువలు నేటి సమాజానికి కూడా ఆదర్శప్రాయమని అన్నారు.

గాంధీజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ సమాజ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని ఆమె పిలుపునిచ్చారు. ముఖ్యంగా ధర్మపురి పట్టణాన్ని పరిశుభ్రంగా, పచ్చదనంతో, ఆరోగ్యకరంగా మరియు అభివృద్ధి చెందిన పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు మున్సిపల్ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కోరారు.
అనంతరం ఆర్యవైశ్య సంఘం సభ్యులు, బీజేపీ నాయకులు, పురప్రముఖులు, ప్రజాప్రతినిధులు తదితరులు మహాత్మా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందారపు రామన్న, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిలుముల లక్ష్మణ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కుంట సుధాకర్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పిన్న శ్రీనివాస్, వార్డు కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, ఆర్యవైశ్య సంఘం సభ్యులు, వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది మరియు పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
