J. SURENDER KUMAR,
ధర్మపురి పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో సోమవారం మాజీ కేంద్ర మంత్రి, స్వర్గీయ గడ్డం వెంకటస్వామి జయంతి వేడుకలను పట్టణ మరియు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి
తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గడ్డం వెంకటస్వామి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..
మాజీ కేంద్ర మంత్రి కాకా గడ్డం వెంకటస్వామి, జీవితాంతం పేదలు, బడుగు బలహీన వర్గాలు, కార్మికుల సంక్షేమం కోసం కృషి చేసిన మహోన్నత నాయకుడని అన్నారు. నిరుపేదలు, ఇళ్లు లేని పేద ప్రజలకు ఇళ్ల నిర్మాణం కల్పించేందుకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.

కార్మికుల పక్షపాతిగా నిలిచి వారి హక్కులు, సంక్షేమం కోసం పోరాడారని, విద్యా సంస్థల స్థాపనకు కృషి చేసి విద్యాభివృద్ధికి విశేష సేవలు అందించారని తెలంగాణ ఉద్యమంలోనూ కాకా వెంకటస్వామి పాత్ర ఎంతో కీలకమైందని మంత్రి అన్నారు.
ఈ కార్యక్రమంలో ధర్మపురి మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి వేముల నాగలక్ష్మి , జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ సంఘనపట్ల దినేష్, జిల్లా కాంగ్రెస్ పార్టీ(DCC) అధ్యక్షులు గాజేంగి నందయ్య , మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిలుముల లక్ష్మణ్ , కౌన్సిలర్లు, పలు మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అభిమానులు తదితరులు పాల్గొని కాకా వెంకటస్వామి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు
