మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి అడ్లూరి !

J.SURENDER KUMAR,

ధర్మపురి పట్టణంలో ఇటీవల మృతి చెందిన పలు కుటుంబాల సభ్యులను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సోమవారం పరామర్శించి ఓదార్చారు.

ప్రముఖ పురాణ ప్రవచకులు డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి  మాతృమూర్తి మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మాజీ ఉపసర్పంచ్ బండారు రాజన్న అల్లుడు

రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు వారి కుటుంబ సభ్యులను మంత్రి ఓదార్చారు.

గంపల వాడలో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను సైతం మంత్రి పరామర్శించి ఓదార్చారు. ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని మంత్రి మృతుల కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు.