J.SURENDER KUMAR,
జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2027–28 విద్యా సంవత్సరానికి ఖాళీగా ఉన్న సీట్లలో 9వ మరియు 11వ తరగతుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే లేటరల్ ఎంట్రీ సెలెక్షన్ టెస్ట్–2027 (JNV LEST-2027) ఆన్‌లైన్ దరఖాస్తుల చివరి తేదీ 15 -10-2026 వరకు తేదీ పొడిగించినట్టు, ఇన్చార్జి ప్రిన్సిపాల్ టి రమేష్పీ ఎం శ్రీ పాఠశాల – జవహర్ నవోదయ విద్యాలయం, మామూనూర్, ప్రకటనలో తెలిపారు.
జవహర్ నవోదయ విద్యాలయాల్లో అందుబాటులో ఉన్న మౌలిక వసతులు మరియు ఇతర సౌకర్యాలను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు, 9వ మరియు 11వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయాలని నవోదయ విద్యాలయ సమితి నిర్ణయించింది.
ఈ ప్రవేశాలు NVS విధానం ప్రకారం బాహ్య సంస్థ నిర్వహించే ఎంపిక పరీక్ష ఆధారంగా జరుగుతాయి.
జవహర్ నవోదయ విద్యాలయాలు పూర్తిగా ఉచిత విద్యను అందించే సహవిద్యా (Co-educational), నివాస పాఠశాలలు. 9వ తరగతిలో హిందీ మాట్లాడే ప్రాంతాల నుంచి హిందీ మాట్లాడని ప్రాంతాలకు, అలాగే దీనికి విరుద్ధంగా విద్యార్థుల మైగ్రేషన్ విధానం ఉంటుంది. విద్యార్థుల సమగ్ర వ్యక్తిత్వ వికాసమే ప్రధాన లక్ష్యం. 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు CBSE అనుబంధంతో, NCERT పాఠ్యప్రణాళిక ఆధారంగా ఇంగ్లీష్ మాధ్యమంలో బోధన జరుగుతుంది అని ప్రకటనలో పేర్కొన్నారు.
👉 9వ తరగతి ప్రవేశానికి అర్హత :..
విద్యార్థి జన్మతేది 01-05-2012 నుంచి 31-07-2014 మధ్య ఉండాలి. రెండు తేదీలు కలుపుకొని.
2026–27 విద్యా సంవత్సరంలో 8వ తరగతి చదువుతూ ఉండాలి.
విద్యార్థి ప్రవేశం కోరుతున్న JNV ఉన్న అదే జిల్లాలోని ప్రభుత్వ/ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 8వ తరగతి చదివి, విద్యా సంవత్సరం పూర్తి చేయాలి.
👉 11వ తరగతి ప్రవేశానికి అర్హత :..
విద్యార్థి జన్మతేది 01-06-2010 నుంచి 31-07-2012 మధ్య ఉండాలి.
2026–27 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదువుతూ ఉండాలి.
JNV ఉన్న అదే జిల్లాలోని ప్రభుత్వ/ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 10వ తరగతి చదివి విద్యా సంవత్సరం పూర్తి చేయాలి.
👉 ముఖ్యమైన తేదీలు….
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 15-10-2026
👉 ఎంపిక పరీక్ష తేదీ: 10-04-2027
పరీక్ష 9వ మరియు 11వ తరగతులకు నిర్వహించబడుతుంది.
👉 రిజర్వేషన్…
75% సీట్లు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు
25% సీట్లు పట్టణ ప్రాంత విద్యార్థులకు
విద్యార్థి తన చదువులో ఏదైనా భాగాన్ని పట్టణ ప్రాంతంలో చదివినట్లయితే, అతడిని/ఆమెను Urban Candidateగా పరిగణిస్తారు.
గ్రామీణ ప్రాంతం అంటే పాఠశాల గ్రామపంచాయతీ పరిధిలో ఉండటం; పట్టణ ప్రాంతం అంటే పాఠశాల మున్సిపాలిటీ/కార్పొరేషన్ పరిధిలో ఉండటం.
SC, ST, PH మరియు బాలికలకు భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర రిజర్వేషన్లు వర్తిస్తాయి.
👉 ఆన్‌లైన్ దరఖాస్తు
అర్హత కలిగిన విద్యార్థులు Navodaya Vidyalaya Samiti అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పత్రంలో 9వ మరియు 11వ తరగతుల కోసం ప్రత్యేక ఆన్‌లైన్ దరఖాస్తు లింకులు కూడా ఇవ్వబడ్డాయి అనే ప్రకటనలో పేర్కొన్నారు.
