నేడు మాజీ మంత్రి జువ్వాడి  99 జయంతి !

J.SURENDER KUMAR,

ప్రజా నాయకుడు స్వర్గీయ మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు ది నేడు 99వ జయంతి.. ధర్మపురి మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన స్వర్గీయ మాజీ మంత్రి  స్వగ్రామ సర్పంచ్ గా రాజకీయ ప్రవేశం చేసి రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా కొనసాగారు.

ధర్మపురి ఆలయ పాలకవర్గ చైర్మన్గా, జగిత్యాల పంచాయతీ సమితి అధ్యక్షుడిగా, రద్దయిన బుగ్గారం నియోజకవర్గ ( 1989  ) లో ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా 1999, 2004 లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా విజయం సాధించి వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం లో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా కొనసాగారు.

ప్రజా నాయకుడిగా,  వ్యవసాయం, విద్యా , వైద్యం సాగునీటి తదితర అంశాలతో పాటు రైతాంగ సమస్యల పరిష్కారం పట్ల ఎల్లలేని కృషి చేశారు.. ఆధునిక వ్యవసాయ సాంకేతిక పద్ధతుల అవగాహనకు ప్రభుత్వం పక్షాన ఇజ్రాయిల్ కు వెళ్లారు. ఉమ్మడి రాష్ట్రం వ్యవసాయ కళాశాల పాలకవర్గ సభ్యుడిగా, ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి సంస్కృతాంధ్ర కళాశాల పాలకవర్గ అధ్యక్షుడిగా  ఆయన సేవలు అందించారు.