జయహో టీమ్ ఇండియా….!


👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి….


J.SURENDER KUMAR,

జపాన్‌లో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై అద్భుత విజయం సాధించిన టీమ్ ఇండియాకు ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

ఈ స్వర్ణ పతకం దేశానికి అపారమైన గౌరవాన్ని, కీర్తిని తీసుకువచ్చి, అంతర్జాతీయ క్రీడా వేదికపై భారత క్రీడా విజయాల చరిత్రలో మరో చిరస్మరణీయ అధ్యాయంగా మిగులుతుందని పేర్కొంటూ టీమ్ ఇండియా జట్టు కెప్టెన్  శ్రేయస్ అయ్యర్‌కు అభినందనలు తెలిపారు.

అభిషేక్ శర్మ అద్భుతంగా సాధించిన 61 పరుగుల ఇన్నింగ్స్‌కు, తెలంగాణ స్టార్ క్రికెటర్ తిలక్ వర్మ అజేయంగా చేసిన 51 పరుగులకు, అలాగే కీలకమైన ప్రారంభ వికెట్లు తీసిన అక్షర్ పటేల్‌ల క్రీడాస్ఫూర్తిని ముఖ్యమంత్రి ప్రశంసించారు.

ఆసియా క్రీడల్లో వివిధ క్రీడాల్లో పట్టుదల, అంకితభావం, క్రీడాస్ఫూర్తితో పోటీపడి పతకాలు సాధించి, అంతర్జాతీయ క్రీడా రంగంలో భారత ప్రతిష్ఠను మరింత పెంచిన భారతీయ క్రీడాకారులందరికీ ముఖ్యమంత్రి  ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.