లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ !

👉 ధర్మారం మండలంలో ₹ 37.58 లక్షల చెక్కుల పంపిణీ !


J.SURENDER KUMAR,


ధర్మారం మండల ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో CMRF చెక్కుల పంపిణీ కార్యక్రమానికి  రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  పాల్గొని 108 మంది లబ్ధిదారులకు ₹ 37.58 లక్షల చెక్కులను అందజేశారు.


👉 ఈ సందర్భంగా మంత్రి  లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…


ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా ఆపదలో ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతూ వైద్య ఖర్చులు భరించలేని కుటుంబాలకు CMRF ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.