J.SURENDER KUMAR,
ధర్మపురి లో మరో నూతన అదనపు జూనియర్ సివిల్ జడ్జి-కమ్-అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టు ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేయడంపై ధర్మపురి బార్ అసోసియేషన్ న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను కలిసి శాలువాతో సన్మానించి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
ధర్మపురి కోర్టుకు శాశ్వత స్థలం కేటాయించి, భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని మంత్రిని కోరారు. ఎండపల్లి మండలానికి చెందిన మూడు గ్రామాలు ప్రస్తుతం గోదావరికాని కోర్టు పరిధిలో ఉన్నందున, ఆయా గ్రామాల ప్రజలు కోర్టు పనుల కోసం అక్కడికి వెళ్లడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రజల సౌకర్యార్థం ఆ మూడు గ్రామాలను ధర్మపురి కోర్టు పరిధిలోకి చేర్చాలని మంత్రిని వినతిగా కోరారు.
ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బందేల రమేష్, ఉపాధ్యక్షుడు మామిడాల శ్రీకాంత్, లీగల్ ఎయిడ్ కౌన్సిల్ జాజాల రమేష్, సీనియర్ న్యాయవాదులు అప్పాల నిరంజన్, రౌతు రాజేష్, అలుక వినోద్, గూడ జితేందర్ రెడ్డి, గడ్డం అనిల్ పాల్గొన్నారు.
