పుష్కర పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్ రాజా గౌడ్ !

👉ఉగ్ర నరసింహ స్వామి ఆలయ పునరుద్ధరణ పనులు పరిశీలన!


J.SURENDER KUMAR,


ధర్మపురి పట్టణంలో గోదావరి పుష్కరాల సందర్భంగా చేపడుతున్న ఘాట్ల నిర్మాణ, తదితర పనులను జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్ శనివారం సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు.

ఘాట్ల నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించిన ఆయన, పుష్కరాల సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన మౌలిక వసతులు, పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్ తదితర ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం ధర్మపురిలోని ఉగ్ర నరసింహస్వామి ఆలయాన్ని పరిశీలించారు. ఆలయ పరిసరాల్లో భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, పారిశుధ్య ఏర్పాట్లు, పుష్కరాల సందర్భంగా చేపట్టాల్సిన ఇతర ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు.

తదుపరి ధర్మపురి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఆసుపత్రిలోని డయాలసిస్ కేంద్రాన్ని పరిశీలించారు. డయాలసిస్ సేవలు, రోగులకు అందుతున్న వైద్య సదుపాయాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడి చికిత్స పొందుతున్న రోగుల వివరాలు, రోగుల జాబితా, ఓపీ రిజిస్టర్‌ను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా, రికార్డులను ఎప్పటికప్పుడు సక్రమంగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు.

అడిషనల్ కలెక్టర్ తో స్థానిక మున్సిపల్ చైర్మన్ నాగలక్ష్మి, ధర్మపురి తహశీల్దార్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్, శ్రీనివాసరావు, ఎంపీడీఓ, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.