పుష్కర పనులు పరిశీలించిన కమిషనర్ హనుమంతరావు !

J.SURENDER KUMAR,


2027 లో జరగనున్న గోదావరి నది పుష్కర పనులను పూర్తి చేయాలని అధికార యంత్రాంగానికి పలు సూచనలు చేస్తూ,  సీనియర్ ఐఏఎస్ అధికారి రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు ఇంజనీరింగ్ రెవెన్యూ దేవాదాయశాఖ అధికారులను ఆదేశించారు..


శనివారం ధర్మపురి గోదావరి నది తీరంలో జరుగుతున్న పుష్కర ఘాట్ పనులను కమిషనర్ అధికారులతో కలిసి పరిశీలించారు. శ్రీ ఉగ్ర నరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణ పనుల ప్రగతి సకాలంలో పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను కమిషనర్ ఆదేశించారు
.

కమిషనర్ ముందుగా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్, వేద పండితులు, అర్చకులు ఆలయ సాంప్రదాయం ప్రకారం పూర్ణకుంభం, మేళతాలాలతో స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు వేద ఆశీర్వచనం భావించి స్వామి వారి శేష వస్త్రం, ప్రసాదం చిత్రపటాన్ని బహుకరించారు.



👉 కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామివారిని దర్శించుకున్న కమిషనర్.!


కమిషనర్ హనుమంతరావు కుటుంబ సభ్యులతో కలిసి కొండగట్టు శ్రీ స్వామిని దర్శించుకుని  స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి  అంజనా రెడ్డి  కమిషనర్ కు స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు వేదమంత్రోచ్ఛారణలతో కమిషనర్ ఆశీర్వచనం చేశారు అందజేశారు.

👉 ఈ సందర్భంగా కమిషనర్  మాట్లాడుతూ…….

కొండగట్టు దేవస్థాన అభివృద్ధికి అవసరమైన పలు అభివృద్ధి పనులను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ₹ 35.19 కోట్ల నిధులతో 96 గదుల ధర్మసత్రం మరియు దీక్ష విరమణ మండపం నిర్మాణానికి సంబంధించిన టెండర్ ప్రక్రియ పూర్తయిందని, పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయని వివరించారు.

నవంబర్ 15వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న శ్రీ స్వామివారి చందనోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు. ఉత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.


దేవస్థానం కార్యనిర్వహణాధికారి అంజనా రెడ్డి,
సహాయ కార్యనిర్వహణాధికారి గుండి హరిహరనాథ్,
పర్యవేక్షకులు సునీల్ కుమార్, ప్రధాన అర్చకులు డాక్టర్ జితేంద్ర ప్రసాద్,  చిరంజీవి స్వామి, మారుతి ప్రసాద్, స్థానాచార్యులు  కపిందర్, ఆలయ పరిశీలకులు అశోక్ మరియు దేవస్థాన అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.