👉 రోజుకు 2 వేల క్యూసెక్కుల నీరు..!
👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..!
J.SURENDER KUMAR,
జిల్లాలోని రోళ్లవాగు ప్రాజెక్టు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కాలువ లకు అవసరమైన మరమ్మతులు చేపట్టి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామని
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలో శనివారం మంత్రి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు.
టినినో ప్రభావంతో వాతావరణంలో మార్పులు, ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో జిల్లాలో వరి సాగు చేసిన రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 3 లక్షల ఎకరాల్లో రైతులు వరి పంట సాగు చేశారని మంత్రి తెలిపారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేస్తేనే పంట చేతికి వచ్చే అవకాశం ఉందని రైతులు వివరిస్తున్నారని మంత్రి అన్నారు.
👉 సీఎంకు పరిస్థితి వివరించాం !
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, పెద్దపల్లి ఎమ్మెల్యే విప్ రమణారావు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్, స్థానిక ఎమ్మెల్యే కలిసికట్టుగా ముఖ్యమంత్రి దృష్టికి , వ్యవసాయ శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి సాగునీటి సమస్య, పరిస్థితిని వివరించామని మంత్రి స్పష్టం చేశారు.
ముందుగా నీటి విడుదలకు స్పందించలేదని, రైతుల పరిస్థితి, లక్షలాది రూపాయల పంట ఎండిపోతుందని విజ్ఞప్తి చేయడంతో నీటి విడుదలకు ఒప్పుకున్నారని మంత్రి అన్నారు.
పంటలను రైతాంగాన్ని ఆదుకోవడం కోసం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి తొమ్మిది రోజులపాటు, రోజుకు రెండు క్యూసెక్కుల నీటిని విడుదలకు ఇరిగేషన్ అధికారులు అంగీకరించారని మంత్రి తెలిపారు.
ప్రజాపాలన ప్రభుత్వం రైతులను అదుకోవడమే లక్ష్యంగా పనిచేస్తోందని తెలిపారు. అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకోవడం, విద్యుత్ కొరత లేకుండా రైతులకు అవసరమైన సహాయం అందించడం వంటి అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి నిర్ణయాలు తీసుకుంటారని మంత్రి తెలిపారు.
ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ వాణి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గాజంగి నందయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, అడువాల జ్యోతి, తదితర నాయకులు పాల్గొన్నారు.
