రోళ్ళవాగు ప్రాజెక్టుకు మాజీ మంత్రి జువ్వాడి పేరు.!

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ..!

J.SURENDER KUMAR,


రైతు పక్షపాతి, రైతాంగ సమస్యలపై సాగునీటి అంశంపై నిరంతరం కృషి చేసిన మాజీ మంత్రి స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావు పేరును జగిత్యాల జిల్లాలోని రోళ్ళవాగు
ప్రాజెక్టుకు అందరి అభిప్రాయాల మేరకు నామకరణం చేయనున్నట్టు  రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  అన్నారు.

మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు 99వ జయంతి వేడుకలు ఆదివారం ధర్మపురి మంత్రి క్యాంప్ కార్యాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. రత్నాకర్ రావు చిత్రపటానికి మంత్రి పలువురు నాయకులు పూలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..

స్వర్గీయ రత్నాకర్ రావు ఈ ప్రాంతా అభివృద్ధికి, విద్య వైద్యం ఆలయాలు, ఆయకట్టు చివరి భూములకు సాగునీటి సౌలభ్యం కోసం లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటుకు ఏనలేని కృషిచేసిన  మహానీయుడు రత్నాకర్ రావు అని అన్నారు.

నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో పలువురిని  పేరుపేరునా పిలిచి సమస్యలను తెలుసుకునే ప్రజా నాయకుడు రత్నాకర్ రావు అని అన్నారు. ఆయన బాటలో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, జిల్లాలో ఇతర నాయకుల  అభిప్రాయం మేరకు రోళ్ళవాగు ప్రాజెక్టుకు స్వర్గీయ రత్నాకర్ రావు పేరును పెట్టనున్నట్టు మంత్రి స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి వేముల నాగలక్ష్మి,  జిల్లా గ్రంధాలయ ఛైర్మెన్ సంఘనబట్ల దినేష్ , మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిరుముల లక్ష్మణ్, కౌన్సిలర్లు,  భారీ సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.