వయోవృద్ధుల సంక్షేమ బాధ్యత ప్రభుత్వానిదే !

👉  తల్లిదండ్రుల సంరక్షణ, పోషణకు ప్రత్యేక చట్టం !

👉  వయోవృద్ధుల కోసం డే కేర్ సెంటర్లు !

👉  ప్రతి జిల్లాలో ప్రత్యేక అధికారి నియమించాలి !

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..!


J . SURENDER KUMAR,


వయోవృద్ధుల సంక్షేమం, సంరక్షణ బాధ్యతను ప్రభుత్వం తీసుకుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా గురువారం  హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.


👉 ఐక్యరాజ్యసమితి నిర్ణయం మేరకు ప్రతి ఏడాది అక్టోబర్ 1న ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో 32.69 లక్షల మంది వయోవృద్ధులు ఉన్నారని పేర్కొన్నారు. వారి సంక్షేమం కోసం రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.


👉 వయోవృద్ధుల సంరక్షణ, పోషణకు ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చిందని మంత్రి తెలిపారు. తల్లిదండ్రుల పోషణ బాధ్యతను విస్మరించే ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల విషయంలోనూ నిబంధనలు వర్తించేలా చట్టాన్ని రూపొందించినట్లు చెప్పారు.


👉 వయోవృద్ధులు మానసికంగా ఉల్లాసంగా, ఆరోగ్యంగా ఉండేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వయోవృద్ధుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రతి జిల్లా కేంద్రంలో ప్రత్యేక అధికారిని నియమించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరినట్లు మంత్రి వెల్లడించారు.


👉 వయోవృద్ధులను గౌరవించడం, వారి సంక్షేమానికి భరోసా కల్పించడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తూ తెలంగాణలో పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.