సిరిసిల్ల లో గెలిచిన ఎమ్మెల్యేకు మంత్రి పదవి  !


👉 అమెరికా, సింగపూర్‌లలో కేటీఆర్  పెట్టుబడుల వివరాలు త్వరలో..
👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !


J.SURENDER KUMAR,


టిఆర్ఎస్ (భారతరాష్ట్రసమితి) కోట సిరిసిల్ల అసెంబ్లీ సెగ్మెంట్ గెలిచిన ఎమ్మెల్యే కు క్యాబినెట్ మంత్రి పదవి ఇస్తామని బుధవారం సిరిసిల్ల పట్టణంలో జరిగిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ రెడ్డి ప్రకటించారు.

చారిత్రాత్మకంగా వస్త్ర పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన సిరిసిల్లను గత నాయకులు హీనాదుస్థితికి ప్రతీకగా మార్చారని సీఎం ఆరోపించారు. దశాబ్దాల పాటు అధికారంలో ఉన్నప్పటికీ, నేత కార్మికుల ఆత్మహత్యలను గానీ, గల్ఫ్ వలసల అడ్డంకులను గానీ ఎందుకు నివారించలేకపోయారని ఆయన ప్రశ్నించారు.

👉 కేటీఆర్‌పై ..!


కేసీఆర్ కుటుంబం, హరీష్ రావు, సంతోష్ కుమార్‌లకు చెందిన ఆస్తుల వివరాలను కేటీఆర్ వెల్లడించాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. “ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ముంటే కేటీఆర్‌కు ఉందా?” అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

“2004, 2006, 2008లలో కరీంనగర్ నుంచి కేసీఆర్‌ను ప్రజలు ఎన్నుకున్నారు. 2009లో కరీంనగర్ ను వదిలి పాలమూరుకు వెళ్లారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత, కేసీఆర్ పాలమూరు ప్రజలను మోసం చేసి గజ్వేల్‌కు తరలివెళ్లారు.” అమెరికా, సింగపూర్‌లలో కేటీఆర్ పెట్టిన పెట్టుబడుల వివరాలను త్వరలో వెల్లడిస్తానని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.

“తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్, కేసీఆర్, కేటీఆర్ గతం అవుతారు, కాంగ్రెస్ అధికారంలోనే కొనసాగుతుంది” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు హాజరు కావడం లేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.  , “కాంగ్రెస్ ప్రభుత్వం ఒక దళితుడిని స్పీకర్‌గా నియమించింది, కేసీఆర్ స్పీకర్‌ను ‘సర్’ అని సంబోధించడానికి ఇష్టపడరు. స్పీకర్‌పై వచ్చిన అవమానకరమైన వ్యాఖ్యలను కేసీఆర్ ఇప్పటికీ ఎందుకు ఖండించలేదు? దళితులు ధర్నా చేసిన తర్వాత ఆయన ఫామ్‌హౌస్‌ను పసుపు నీటితో శుభ్రం చేసిన తీరులో కేసీఆర్ అహంకారం ప్రజలకు స్పష్టంగా కనిపించింది. రాష్ట్రంలోని దళితులు ఆకలిని భరిస్తారు కానీ అవమానాన్ని భరించలేరు.” అనే సీఎం అన్నారు.

👉 ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి  మొదటిసారి సిరిసిల్ల పర్యటన ఇలా జరిగింది !

👉 సాయంత్రం 5.00 గంటలకు హెలీకాప్టర్ సిరిసిల్లకు చేరింది.


👉 5.10 గంటలకు హెలీకాప్టర్ ల్యాండ్ అయింది. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమారౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మ ణ్ కుమార్ సీఎం తో హెలికాప్టర్ లో వచ్చారు.


👉 సీఎంకు స్వాగతం 5.15 గంటలకు హెలీప్యాడ్ వద్ద ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కాంగ్రె స్ నాయకులు, కలెక్టర్ గరీమా అగ్ర వాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ లు


👉 5.28 గంటలకు అంబేడ్కర్ సర్కి లకు సీఎం చేరుకున్నారు.


👉 5.30 గంటలకు భారీ జనంతో పాద యాత్రగా నేతన్నచౌక్, చంద్రంపేట క్రాస్రోడ్డు మీదుగా.. సభా స్థలివ రకు కాలినడకన సీఎం చేరుకున్నారు.


👉 6.15 గంటలకు జిల్లాలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.


👉 6.20 గంటలకు వేదికపై కి


👉 6.25  తెలంగాణ రాష్ట్ర గీతంతో సభ ప్రారంభం!


👉 6.55 గంటల వరకు మంత్రుల ప్రసంగం !


👉 6.55 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం ప్రారంభం !

👉 7.45 గంటలకు సీఎం ప్రసంగం ముగింపు  !


👉 8.00 గంటలకు రోడ్డు మార్గంలో  హైదరాబాద్ కు సీఎం