👉 మంత్రి లక్ష్మణ్ కుమార్ చొరవతో ధర్మపురికి నిధుల వరద !
👉 మున్సిపల్ చైర్ పర్సన్ వేముల నాగలక్ష్మి !
J.SURENDER KUMAR,
ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురికి పుష్కరాల సందర్భంగా అభివృద్ధి పనులకు మంత్రి లక్ష్మణ్ కుమార్ చొరవతో కొట్లాది రూపాయల నిధులు అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేయడంతో పట్టణానికి ముందస్తు పుష్కర శోభ వచ్చిందని ధర్మపురి మున్సిపల్ చైర్ పర్సన్ వేముల నాగలక్ష్మి అన్నారు.
ధర్మపురి పట్టణంలో వివిధ వార్డులలో ₹13 కోట్ల నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులకు గురువారం చైర్ పర్సన్ కౌన్సిలర్లు అధికారులతో కలిసి గురువారం భూమి పూజలు చేశారు.
👉 ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ..

2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించాలనే లక్ష్యంతో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక చొరవ, సహకారంతో పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు అన్నారు.
👉 పనుల వివరాలు..

👉 ₹13 కోట్ల నిధులతో చేపట్టనున్న నూతన రోడ్డు నిర్మాణం, డ్రైనేజీ పైప్లైన్ తదితర అభివృద్ధి పనుల భూమి పూజలు !
👉 ఎన్హెచ్-63 పెట్రోల్ పంపు నుంచి అయ్యప్పస్వామి ఆలయం, కమలాపూర్ రోడ్డు, దుర్గాకాలనీ వరకు డ్రైనేజీ పైప్లైన్ నిర్మాణం.!
👉 ఎన్హెచ్-63 నుంచి ప్రభుత్వ ఆసుపత్రి మీదుగా హరిత హోటల్ వరకు రోడ్డు నిర్మాణం..!
👉 ఎన్హెచ్-63 పుష్కర కాలనీ నుంచి శ్మశానవాటిక, హరిత హోటల్ వరకు రోడ్డు నిర్మాణ పనులు..!
👉 మంత్రికి కృతజ్ఞతలు… చైర్ పర్సన్!

మంత్రి లక్ష్మణ్ కుమార్ సహకారంతో పట్టణంలోని 15 వార్డుల్లో కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని అన్నారు. పుష్కరాలను విజయవంతంగా, అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రతి వార్డులో అవసరమైన అభివృద్ధి పనులను గుర్తించి ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తున్నామని ఈ సందర్భంగా కొట్లాది రూపాయల నిధులు మంజూరు చేసిన మంత్రికి చైర్ పర్సన్ కృతజ్ఞతలు తెలిపారు.

భూమి పూజ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయం ఛైర్మెన్ సంఘనబట్ల దినేష్, వైస్ చైర్ పర్సన్ ఇందారపు రామయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిలుముల లక్ష్మణ్, వార్డు కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, మాజీ కౌన్సిలర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, ఇంజనీరింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
