ప్రజల సొమ్ముతో ఫామ్ హౌస్ లు కట్టుకున్నారు !

👉 పేద విద్యార్థుల భవిష్యత్, సంక్షేమాన్ని విస్మరించారు !

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

హరీష్ రావు, మా ప్రజా ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం విషయంలో ఎలాంటి రాజీ పడదు.  పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో పేద విద్యార్థుల భవిష్యత్, సంక్షేమాన్ని విస్మరించారు , ప్రజల సొమ్ముతో మీరు ఫామ్ హౌస్ లు కట్టుకున్నారు , తెలంగాణ పేద పిల్లలకు దేశంలోనే అత్యుత్తమ విద్యా, వసతి, సంక్షేమ సదుపాయాలు అందించడమే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం లక్ష్యం అని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్‌ తో కలిసి మంత్రి లక్ష్మణ్ కుమార్ విలేకరుల సమావేశంలో  మాట్లాడారు.

👉 ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.


టైలు, బెల్టులు, ఐడీ కార్డుల మొత్తం ఆర్డర్‌ను TGLIPCకు అప్పగించాం.

👉 యూనిఫాం వస్త్రం, కార్పెట్లు, దుప్పట్లు, బెడ్డింగ్ సామగ్రిలో గణనీయమైన వాటాను TGSCOకు కేటాయించాం.

👉 నోటుబుక్‌ల సరఫరాను తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్‌కు అప్పగించాం.

👉 14 వేల మంది మహిళా టైలర్లకు యూనిఫాం కుట్టు పనులు కల్పించి ఉపాధి అవకాశాలు కల్పించాం.

👉 27 లక్షల మంది విద్యార్థులకు తొలిసారి సమగ్ర సదుపాయాలు

👉 తెలంగాణ చరిత్రలో తొలిసారిగా గురుకులాలు, కేజీబీవీలు, సంక్షేమ హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఏకరీతి నాణ్యతతో సదుపాయాలు అందిస్తున్నాం.

👉 తెల్లటి యూనిఫాం, తెల్లటి బూట్లు, తెల్లటి సాక్సులు, స్కూల్ బ్యాగ్, బెల్ట్, టై, ట్రంక్ బాక్స్, బెడ్డింగ్ కిట్, పీటీ డ్రస్, నైట్ డ్రస్ వంటి సమగ్ర కిట్ అందజేస్తున్నాం.

👉 దాదాపు 27 లక్షల మంది విద్యార్థులు ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందనున్నారు.

👉 విద్యార్థుల సంక్షేమంలో ప్రజా ప్రభుత్వం కొత్త అధ్యాయం
డైట్ ఛార్జీలు పెంచాం.

👉 కాస్మెటిక్ ఛార్జీలు పెంచాం. టీచింగ్, నాన్-టీచింగ్ సిబ్బంది బకాయిలు చెల్లిస్తున్నాం.

👉 అద్దె భవనాల బిల్లులను ప్రతినెల సకాలంలో విడుదల చేస్తున్నాం. ప్రతి జిల్లాలో మరమ్మతులు, తాగునీరు, పారిశుద్ధ్య పనుల కోసం కలెక్టర్లకు ప్రత్యేక నిధులు అందుబాటులో ఉంచాం.

👉 బీఆర్ఎస్ నాయకులకు మంత్రి అడ్లూరి సూటి ప్రశ్నలు !

@ పదేళ్ల పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం ఎన్ని కొత్త హాస్టళ్లు నిర్మించారు?

@ డైట్ ఛార్జీలు ఎందుకు పెంచలేదు?

@ కాస్మెటిక్ ఛార్జీల పెంపు గురించి ఎందుకు ఆలోచించలేదు?

@ విద్యార్థులకు నాణ్యమైన సదుపాయాలు అందించే ప్రయత్నాన్ని ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారు?

@ గురుకుల విద్యార్థులు మంచి బట్టలు వేసుకోవడం, మంచి సదుపాయాలు పొందడం బీఆర్ఎస్ నాయకులకు ఇబ్బందిగా ఉందా?

@ అక్రమాలు జరిగాయని చెబుతున్నట్లయితే ఆధారాలు బయటపెట్టాలి. లేకపోతే ఆరోపణలు వెనక్కి తీసుకోవాలి.

👉 మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ మాట్లాడుతూ….

👉 ₹687.78 కోట్ల టెండర్‌ను ₹2,000 కోట్ల కుంభకోణంగా చిత్రీకరించడం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం.
కేంద్రీకృత కొనుగోలు విధానం వల్ల నాణ్యత, పారదర్శకత, సమయానికి సరఫరా సాధ్యమవుతోంది.

👉 ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమాన్ని అత్యున్నత ప్రాధాన్యతగా తీసుకుంది.

👉 హరీష్ రావు వద్ద ఆధారాలు ఉంటే బయటపెట్టాలని మంత్రి అజారుద్దీన్ సవాల్ విసిరారు.