👉 హరీశ్ రావు ఆరోపణలు అవాస్తవం అబద్ధాలు !
👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
తెలంగాణ ప్రభుత్వ ఈ-ప్రొక్యూర్‌మెంట్ పోర్టల్ ద్వారా, జాతీయ స్థాయి పోటీ టెండర్ల ద్వారా టెండర్ ప్రక్రియ చేపట్టింది. మొత్తం టెండర్ విలువ ₹ 687.78 కోట్లు మాత్రమే. మరి ఇందులో ₹ 2,000 కోట్ల కుంభకోణం అనే అంకె ఎక్కడి నుంచి వచ్చిందో హరీశ్ రావు ప్రజలకు సమాధానం చెప్పాలి, అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, హరీష్ రావు ను డిమాండ్ చేశారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం హరీష్ రావు రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనం అని ఆధారాలు ఉంటే విచారణ సంస్థలకు ఇవ్వాలి, లేకపోతే ప్రజలను తప్పుదోవ పట్టించడం మానుకోవాలి. అంటూ మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ తో కలిసి మంత్రి లక్ష్మణ్ కుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
👉 ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…
గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు, కేజీబీవీలు, ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యాసంస్థల విద్యార్థులకు సదుపాయాల కల్పన కోసం చేపట్టిన కొనుగోలు ప్రక్రియపై మాజీ మంత్రి బి ఆర్ ఎస్ పార్టీ శాసనసభ పక్ష నేత టి. హరీశ్ రావు చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నవని మంత్రి లక్ష్మణ్ కుమార్ తీవ్రంగా ఖండించారు.
👉 మొత్తం టెండర్ విలువ ₹ 687.78 కోట్లు మాత్రమే. మరి ₹ 2,000 కోట్ల కుంభకోణం అనే అంకె ఎక్కడి నుంచి వచ్చిందో హరీశ్ రావు ప్రజలకు సమాధానం చెప్పాలి అన్నారు.
👉 ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనం. ఆధారాలు ఉంటే విచారణ సంస్థలకు ఇవ్వాలి, లేకపోతే ప్రజలను తప్పుదోవ పట్టించడం మానుకోవాలి.
👉 ఈ టెండర్ ప్రక్రియ పూర్తిగా తెలంగాణ ప్రభుత్వ ఈ-ప్రొక్యూర్‌మెంట్ పోర్టల్ ద్వారా, జాతీయ స్థాయి పోటీ టెండర్ల ద్వారా చేపట్టింది.
👉 దేశవ్యాప్తంగా 27 బిడ్లు వచ్చాయి. టెక్నికల్ అర్హతలు, ఫైనాన్షియల్ బిడ్ల పరిశీలన అనంతరం L1 విధానంలో టెండర్లు ఖరారు చేశాం. ఏ ఒక్క సంస్థకు నామినేషన్ పద్ధతిలో టెండర్ ఇవ్వలేదు. గుజరాత్ కాంట్రాక్టర్ కథలు పూర్తిగా కల్పితం.
👉 ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ సహా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సంస్థలు పోటీ పడి టెండర్లు దక్కించుకున్నాయి. దక్కించున్న వాటిలో గుజరాత్ కంపెనీ అసలే లేదు. హైకోర్టు సైతం కేంద్రీకృత కొనుగోలు విధానంపై ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు.
👉 ప్రభుత్వ రంగ సంస్థలకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట !
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో LIDCAPకు ( లిడికాప్) కేవలం ₹.40.21 లక్షల విలువైన పనులు మాత్రమే ఇచ్చారు. కానీ మా ప్రభుత్వం కేవలం రెండేళ్లలో ₹ 51 కోట్ల రూపాయల వర్క్ ఆర్డర్ ను LIDCAP కు ఇచ్చాం.
దీని బట్టి ఎవరు ఏ సంస్థలకు పెద్దపీట వేశారు అర్థం చేసుకోవచ్చు అని దీని తెలంగాణ ప్రజలు గమనించాలి అనే మంత్రి స్పష్టం చేశారు.
