J.SURENDER KUMAR,
కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకును రాష్ట్ర స్థాయి బెస్ట్ పెర్ఫార్మింగ్ DCCB గా అవార్డును పొందింది.
నాబార్డ్ స్థాపించి 45 సంవత్సరములు పూర్తి అయిన సందర్భముగా హైదరాబాద్ నాబార్డ్ ప్రాంతీయ కార్యాలయంలో గురువారం జరిగిన కార్యక్రమంలో అవార్డును ప్రధానం చేశారు. ముఖ్య అతిథిగా సీనియర్ ఐఏఎస్ అధికారి స్పెషల్ సెక్రటరీ రూరల్ డెవలప్మెంట్ దానకిశోర్, పాల్గొని అవార్డ్ ను ప్రధానం చేశారు.
ఈ కార్యక్రమంలో ఐఏఎస్ అధికారి డా నవీన్ నికోలస్ డైరెక్టర్ విద్యాశాఖ , నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ ( CGM ) ఉదయభాస్కర్, రిజర్వ్ బ్యాంకు రీజినల్ డైరెక్టర్, చిన్మయి కుమార్, N. సత్యనారాయణ రావు బ్యాంకు ముఖ్య కార్య నిర్వహణాధికారి, బి.శ్రీధర్ మరియు మహమ్మద్ రియాజుద్దీన్ జనరల్ మేనేజర్లు, డీజీఎం బ్రహ్మానంద రావు, హైదరాబాద్ మరియు SLBC కన్వీనర్, ఇతర బ్యాంకు అధికారులు, వ్యవసాయ యూనివర్సిటీ మరియు రాష్ట్ర ఉద్యాన వర్సిటీ వైస్ చాన్స్ లర్స్, NGO లు స్వయం సహకార బృందాలు, నాబార్డ్ జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
