👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !
J.SURENDER KUMAR,
మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు కోసం అవసరమైన భూసేకరణను వేగవంతం చేయాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భూసేకరణకు ల్యాండ్ పూలింగ్ విషయంలో స్పష్టమైన విధానం రూపొందించాలని చెప్పారు.
👉 మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్‌పై ముఖ్యమంత్రి ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టు ఫేజ్-2 కి వీలైనంత తొందరగా టెండర్లు పిలవాలని చెప్పారు.
👉 భూసేకరణ ప్రక్రియలో ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్, అసైన్డ్ భూముల సేకరణకు స్పష్టమైన విధివిధానాలు రూపొందించాలని అన్నారు. ఇందులో న్యాయపరమైన ఎలాంటి చిక్కులు రాకుండా జాగ్రత్త వహించాలని చెప్పారు.

👉 మూసీ రివర్‌ఫ్రంట్‌లో భాగంగా చేపట్టే ప్రాజెక్టులకు అతి తక్కువ వడ్డీకి రుణ సదుపాయాలపై మున్సిపల్ కమిషనర్లు దృష్టి సారించాలని, అలాగే టీడీఆర్‌లు జారీ చేసే విషయంలో కూడా ప్రతి వారం సమీక్షించాలని చెప్పారు.
👉 గండిపేట మంచిరేవుల సమీపంలోని ఓంకారేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి తక్షణం టెండర్లు పిలవాలని ఆదేశించారు. అలాగే, కొత్వాల్‌గూడ బర్డ్స్ పార్క్‌కు విస్తృత ప్రచారం కల్పించాలని చెప్పారు.
👉 ఈ సమావేశంలో హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు, ఎంఆర్‌డీసీఎల్ ఎండీ, జేఎండీ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
