సాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తా !

👉 154 మంది లబ్ధిదారులకు ₹ 75 లక్షలు చెక్కుల పంపిణీ చేసిన మంత్రి లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,


ధర్మపురి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు సాగు నీటి  , రైతుల  సమస్యల పరిష్కారం దిశగా కృషి చేస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులతో పాటు కల్యాణ లక్ష్మి చెక్కులను మంత్రి ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో లబ్ధిదారులకు అందజేశారు.


👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…..


రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధితో సంక్షేమం పథకాలను ప్రజలకు అందిస్తున్నామని, వ్యవసాయ ఆధారితమైన ధర్మపురి నియోజకవర్గంలో ని అన్ని గ్రామాలకు సాగునీటిని అందించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఇందుకు తగిన నిధులు కేటాయిస్తున్నట్లు మంత్రి తెలిపారు.


👉 గొల్లపల్లి మండలంలోని రంగధాముని పల్లి, దీకొండ చెరువు అభివృద్ధి చేసి పెగడపల్లి మండలంలో సాగునీటిని అందించడానికి చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. పెగడపల్లి మండలంలో గిరిజన సంక్షేమ శాఖ ద్వారా కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మంత్రి అడ్లూరి తెలిపారు. మండలంలోని అన్ని వర్గాల ప్రజలను సమన్వయం చేసుకొని మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు.


👉 సంక్షేమ కార్యక్రమంలో భాగంగా పెగడపల్లి మండలంలోని 39 మంది లబ్ధిదారులకు ₹ 39,04,524 విలువ కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 115 మంది లబ్ధిదారులకు ₹ 35 లక్షల 39,500 విలువైన చెక్కులను అందజేస్తున్నట్లు మంత్రి తెలిపారు.ప్రజా సంక్షేమమే ముందుకు సాగుతున్న ప్రజాపాలనలో
వచ్చే దసరాకి మహిళా సోదరిమణులకు ఇందిరమ్మ చీరలు అందజేస్తామని మంత్రి తెలిపారు.


👉 2027 లో నిర్వహించే గోదావరి పుష్కరాలకు పెద్ద ఎత్తున ప్రభుత్వం నుండి నిధులు తీసుకు వస్తున్నట్లు మంత్రి వివరించారు. ధర్మపురి నియోజకవర్గంలో పుష్కరాల పనులకు ప్రభుత్వం ఇప్పటికే ₹ 117 కోట్లు మంజూరు చేయగా ఇటీవల ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పర్యటన సందర్భంగా ₹ 80 కోట్ల నిధులు కావాలని కోరగా ఆర్థిక శాఖ నుండి అనుమతి లభించినట్లు మంత్రి ప్రకటించారు.


ఈ కార్యక్రమంలో పెగడపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ రాములు, పెగడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుపతి, ఒరుగాలి శ్రీనివాస్, సంది మల్లారెడ్డి తోపాటు వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.