ఆర్యవైశ్యులకు అండగా ప్రభుత్వం…!


👉 ఆర్యవైశ్య సంఘ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం లో  మంత్రి లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,


ఆర్యవైశ్యులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ఆదివారం ధర్మపురి మండలం మరియు పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ పదవీ స్వీకార ప్రమాణ కార్యక్రమానికి  మంత్రి లక్ష్మణ్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.


ధర్మపురి మండలం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా సాయిని శ్రీనివాస్, ధర్మపురి పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా పిన్న శ్రీనివాస్ ఎన్నికగా ధర్మపురి పట్టణంలో ని శ్రీ లక్ష్మీనరసింహ గార్డెన్స్ లో పదవి స్వీకార ప్రమాణ కార్యక్రమం నిర్వహించారు.


👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…

ఆర్య వైశ్యు లు ఉన్నచోట అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారని మంత్రి  అన్నారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా రోశయ్య కు కాంగ్రెస్ పార్టీ అవకా అవకాశం కల్పించిందని మంత్రి లక్ష్మణ్ కుమార్ గుర్తు చేశారు.

ధర్మపురి ఎమ్మెల్యేగా గెలుపొందడం పూర్వ జన్మ లో చేసుకున్న పుణ్యమని, నేను ఎమ్మెల్యేగా గెలిచిన నాటినుండి ఇబ్బంది పెట్టలేదని మంత్రి తెలిపారు. ఆర్యవైశ్యులు ప్రభుత్వానికి అండగా ఉండాలని మంత్రి కోరారు. నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి ఆర్యవైశ్యులకు తాను అండగా నిలుస్తానని అన్నారు.

👉 హోటల్ ను ప్రారంభించిన మంత్రి…

వెల్గటూర్ మండలం పాసిగాం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘గమ్యం’ హోటల్ ను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ ధర్మపురి, కోటిలింగాల, గూడెం గుట్టకు వచ్చే భక్తులకు సౌకర్యంగా ఉండే విధంగా గమ్యం హోటల్ ఉందని అన్నారు.

యాత్రికులతో పాటు మంచిర్యాల, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, లక్షేట్ పేట నుండి కరీంనగర్, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులకు సైతం గమ్యం హోటల్ ఉపయోగంగా ఉంటుందని అన్నారు. భోజన ప్రియులకు రుచికరమైన, నాణ్యమైన భోజనాన్ని అందించాలని నిర్వాహకులకు సూచించారు.