త్వరలో ఇందిరమ్మ బీమా పథకం!

👉 విద్యార్థులను భవిష్యత్తు మానవ వనరులుగా తీర్చిదిద్దడం లక్ష్యం..

👉 ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కు !

J SURENDER KUMAR,


పేద ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో ఇందిరమ్మ బీమా పథకాన్ని తీసుకు వస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. ఆదివారం రాత్రి పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి భట్టి విక్రమార్క పాల్గొన్నారు.రాత్రి 10 గంటలు దాటిన భట్టి విక్రమార్క కుస్వాగతం పలకడానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

👉 ఈ సందర్భంగా ధర్మారంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ…….

రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకొని ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వం గడిచిన రెండున్నర సంవత్సరాలుగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకు సాగుతుందని అన్నారు.


👉 ఇందులో భాగంగా ₹ 22,500 కోట్లతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని భట్టి తెలిపారు. రాష్ట్రంలో కోటి ఆరు లక్షల మందికి రేషన్ కార్డు అందజేయడంతో పాటు అరకిలోల సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని భట్టి తెలిపారు.


👉 తెలంగాణకు భవిష్యత్తు మంచి మానవ వనరులను అందించడానికి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అల్పాహారం అందించడంతో పాటు వారానికి మూడు రోజులపాటు పాలు రాగి, జావా అందజేస్తున్నామని తెలిపారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని భట్టి తెలిపారు.


👉 రాష్ట్రంలో త్వరలో ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఉపముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రజా ప్రభుత్వం అనేక మార్పులు తీసుకువస్తున్నారు ప్రతి నియోజకవర్గంలో రూపాయలు రెండు వందల కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు భట్టి తెలిపారు.


👉 తెల్లవారితే అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పటికీ మంత్రి లక్ష్మణ్ కుమార్ నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ అనేక ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నారని మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆహ్వానం మేరకు ధర్మపురి ఉగ్ర నరసింహ స్వామి భూమి పూజలు పాల్గొనడం జరుగుతుందని ఉపముఖ్యమంత్రి తెలిపారు.


👉 డిప్యూటీ సీఎం ను స్వాగతించిన కలెక్టర్ ఎస్పీ !


ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు ధర్మపురి లో స్వాగతం పలికిన రాష్ట్ర దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి హనుమంతరావు, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.