J.SURENDER KUMAR,
2026 సెప్టెంబర్ 28 (సోమవారం) నుంచి సెప్టెంబర్ 30 వరకు మూడు రోజుల పాటు జరగాల్సిన ఈ సమ్మెను తాత్కాలికంగా విరమించుకుంటున్నట్లు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) అధికారిక సర్క్యులర్ ద్వారా ప్రకటించింది.
చీఫ్ కార్మిక కమిషనర్ , ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA), మరియు UFBU ప్రతినిధుల మధ్య రాత్రి జరిగిన చర్చల అనంతరం ఈ సమ్మెను వాయిదా వేయాలని నిర్ణయించారు.
దీంతో దేశవ్యాప్తంగా బ్యాంకులు మరియు ఏటీఎం సేవలు యధావిధిగా కొనసాగుతున్నాయి.
👉 అధికారిక సర్క్యులర్ లోని ముఖ్య వివరాలు:

సమ్మె వాయిదా (Strike Deferred): సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు ప్రతిపాదించిన సమ్మెను తాత్కాలికంగా నిలిపివేశారు.
👉 ప్రధాన డిమాండ్లు: 5 రోజుల పని వారం , పెన్షన్ల అప్‌డేషన్, మరియు ఇతర ఉద్యోగ సమస్యలపై చర్చలు జరిగాయి.
👉 కమిటీ ఏర్పాటు: ఉద్యోగుల ప్రధాన డిమాండ్ అయిన ‘5 రోజుల పని వారం’ పరిశీలనకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసేందుకు అంగీకారం కుదిరింది. తదుపరి చర్చల తేదీలను త్వరలోనే ప్రకటిస్తారు.
