👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
రాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యాన్ని మరింత మెరుగుపరచడానికి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జగిత్యాల జిల్లాలో బుగ్గారం, బీర్పూర్ రెండు నూతన తహశీల్దార్ కార్యాలయాల నిర్మాణానికి అనుమతి మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రిఅడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.

ఈనెల 26న రెవెన్యూ (డీఏ. సీఎంఆర్‌ఎఫ్) శాఖ ఈ మేరకు జీవో ఆర్టీ నెం. 597ను ద్వారా పేర్కొన్న ఉత్తర్వులలో నాగర్‌కర్నూల్ జిల్లాలో నూతన ఆర్‌డీవో (RDO) కార్యాలయంతో పాటు, రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఏడు నూతన తహశీల్దార్ కార్యాలయాల భవనాల నిర్మాణానికి ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసిందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.
జగిత్యాల జిల్లాలోని బీర్ పూర్, బుగ్గారం మండలాల్లో నూతన తహశీల్దార్ కార్యాలయం నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. జగిత్యాల తోపాటు ఆయా జిల్లాల కలెక్టర్ల నుంచి వచ్చిన ప్రతిపాదనల ఆధారంగా నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.
👉 ప్రభుత్వం మంజూరు చేసిన కార్యాలయాల వివరాలు..

నాగర్‌కర్నూల్ జిల్లాలో నాగర్ కర్నూల్ రెవెన్యూ డివిజన్ కార్యాలయం తోపాటు జగిత్యాల జిల్లా బీర్‌పూర్, బుగ్గారంలో తహశీల్దార్ కార్యాలయం, రేగొండ (జయశంకర్ భూపాలపల్లి జిల్లా) మొగుళ్లపల్లి (జయశంకర్ భూపాలపల్లి జిల్లా) శ్రీరంగపూర్ (వనపర్తి జిల్లా) హనుమకొండ (హనుమకొండ జిల్లా) భీమ్‌గల్ (నిజామాబాద్ జిల్లా) బుగ్గారం (జగిత్యాల జిల్లా) నిర్మాణాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. హైదరాబాద్‌లోని తెలంగాణ భూ పరిపాలనా ప్రధాన కమిషనర్‌ను (CCLA) ప్రభుత్వం ఆదేశించినట్లు మంత్రి తెలిపారు.
