సీఎం రేవంత్ రెడ్డి కి ఆర్యదాన్ అవార్డు !

J.SURENDER KUMAR,

ముఖ్యమంత్రి  రేవంత్‌రెడ్డి  ప్రతిష్టాత్మక ‘ఆర్యదాన్ ముహమ్మద్-2026’ అవార్డుకు ఎంపిక‌య్యారు. కేరళకు చెందిన దిగ్గ‌జ నేత‌, మాజీ మంత్రి దివంగత ఆర్యదాన్ ముహమ్మద్ స్మారకార్థం ఆర్యదాన్ ముహమ్మద్ ఫౌండేషన్ (AMF) ఈ పురస్కారాన్ని అందజేస్తోంది.


👉 తెలంగాణలో రైతులు, వెనుకబడిన వర్గాలు, సామాన్య ప్రజల సంక్షేమానికి రేవంత్‌రెడ్డి  చేపట్టిన వినూత్న కార్యక్రమాలు, దూరదృష్టితో కూడిన నాయకత్వానికి గానూ ఉత్తమ ప్రజా సేవకుడు అవార్డుకు ఎంపిక చేసిన‌ట్లు ఫౌండేషన్ వర్కింగ్ ఛైర్మ‌న్‌, నిలంబూర్ ఎమ్మెల్యే ఆర్యదాన్ షౌక‌త్  తెలిపారు.


👉 అవార్డు ఎంపిక‌కు ఎంపీ బెన్నీ బెహన‌న్‌, కేరళ రెవెన్యూ శాఖ మంత్రి ఎ.పి. అనిల్‌కుమార్, ప్రముఖ మేధావి కల్పేట్టా నారాయణన్ జ్యూరీగా వ్య‌వ‌హ‌రించారు. ప్రజాస్వామిక విలువలపై రేవంత్ రెడ్డి కి ఉన్న నిబద్ధతను ఈ సంద‌ర్భంగా జ్యూరీ ప్రత్యేకంగా కొనియాడింది.


👉 ఆర్యదాన్ ముహమ్మద్ నాలుగో వర్ధంతిని పురస్కరించుకుని కేరళలోని నిలంబూర్‌లో ఈ నెల 25 న తేదీ శుక్ర‌వారం జరిగే కార్యక్రమంలో అవార్డును ప్రదానం చేయనున్నారు. వేడుకలో ఎంపీ కేసీ వేణుగోపాల్  ఆర్యదాన్ ముహమ్మద్ స్మారక ఉపన్యాసం చేస్తారు.