J.SURENDER KUMAR,
హైదరాబాద్ గణేష్ నిమజ్జన బందోబస్తు విధుల్లో ఉన్న కొత్తగూడెం టూ-టౌన్ సబ్ ఇన్‌స్పెక్టర్ కె. వెంకన్న గుర్తుతెలియని వాహనం ఢీకొన్న దుర్ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందడం అత్యంత బాధాకరమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
శాంతిభద్రతల పరిరక్షణలో అంకితభావంతో విధులు నిర్వర్తిస్తూ ప్రాణాలు కోల్పోవడం విషాదకరమని వ్యాఖ్యానించారు. వెంకన్న మరణం ఆయన కుటుంబానికే కాకుండా యావత్ పోలీసు శాఖకు తీరని లోటని అన్నారు. వెంకన్న పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
వెంకన్న కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. బాధ్యతారాహిత్యంగా వాహనం నడిపి ఈ ప్రమాదానికి కారణమైన నిందితుడిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి పోలీసు అధికారులను ఆదేశించారు.
