👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..!
J. SURENDER KUMAR
ఈనెల 30న సిరిసిల్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించే బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో మహిళల సోదరీమణులు తరలిరావాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మంత్రి అడ్లూరి ఆదివారం మెప్మా మహిళలతో సమావేశం నిర్వహించారు.
👉 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…….
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారని అన్నారు. ఇందులో భాగంగా మహిళా సంఘాలకు పెద్ద మొత్తంలో వడ్డీ లేని రుణాలు ఇవ్వడంతో పాటు ఆర్థికంగా పథకాలను రూపొందించినట్లు మంత్రి తెలిపారు.

👉 మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంకులు, సోలార్ పవర్ ప్లాంట్ లు ఏర్పాటుచేసి వ్యాపార రంగంలో రాణించే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి సిరిసిల్ల సభకు వస్తున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
