J.SURENDER KUMAR,
ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం కు దాత బుధవారం లక్షలాది రూపాయల విలువ వాహనం బహుకరించారు.
హైదరాబాద్ కు చెందిన ఆశిష్ కులకర్ణి కవిత ఆలయంలో స్వామివారి సేవలో వివిధ పనుల నిమిత్తం వాహనం వినియోగించాల్సిందిగా కోరుతూ దాదాపు ₹ 6.50 లక్షల విలువగల మారుతి సుజుకి కంపెనీ గల ట్రాలీ గూడ్స్ వాహనం బహుకరించారు.
దాత కు దేవస్థానం పక్షాన శ్రీ స్వామి వారి శేష వస్త్రం, ప్రసాదం, కార్యనిర్హణాధికారి సంకటాల శ్రీనివాస్ బహుకరించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు బొజ్జ రమేష్ శర్మ , ఉప ప్రధాన అర్చకులు నేరెళ్ల శ్రీనివాసచార్యులు ,సూపరింటెండెంట్ అల్వాల శ్రీనివాస్ అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు.
