J.SURENDER KUMAR,
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం సిరిసిల్ల పర్యటనలో భాగంగా ₹340 కోట్ల వ్యయంతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రధానంగా సిరిసిల్ల వాసులు కోరుకున్న నేతన్న బజార్‌తో పాటు అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
🌟🌟 ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన పనుల వివరాలు!
👉 సిరిసిల్లతో పాటు వేములవాడలో ₹ 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం !
👉 సిరిసిల్ల, కోనరావుపేటలో తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల నిర్మాణం.!
👉 వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా ₹ 99.40 కోట్ల పనులు.!
👉 సిరిసిల్ల, వేములవాడలో రెండు ఆర్డీవో కార్యాలయాలు, తంగళ్లపల్లి, వీర్నపల్లి, వేములవాడ రూరల్, రుద్రంగిలో నాలుగు తహసీల్దార్ కార్యాలయాలు, వేములవాడలో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయ భవన నిర్మాణాలు.!
👉 రుద్రంగిలో 10 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములు, అనుబంధ యూనిట్ల నిర్మాణం.!
👉 వేములవాడలో మహిళా పోలీస్ స్టేషన్‌తో పాటు వేములవాడ, సిరిసిల్లలో రెండు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల నిర్మాణం !
👉 సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని పెద్దూరులో నిర్మించిన ఇందిరా మహిళా శక్తి భవన్ ప్రారంభోత్సవం !
