నేడు తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం !
J.SURENDER KUMAR,
తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం గురువారం ( అక్టోబర్ 1న ) హైదరాబాదులోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో 6 వ అంతస్తులో జరగనున్నది.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు బుధవారం సర్కులర్ జారీ చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ క్యాబినెట్ సమావేశం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు నుంచి 37 వ క్యాబినెట్ సమావేశం. మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం ప్రారంభం కానున్నది.
