జగిత్యాల జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ గా డా శ్రీనివాస్ రెడ్డి !

👉 వైస్ చైర్మన్ గా భీమనాతి  ఉమాదేవి !

👉 స్టేట్ మేనేజింగ్ కమిటీ సభ్యుడిగా సిరిసిల్ల శ్రీనివాస్ !

  J . SURENDER KUMAR,


జగిత్యాల జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ గా డాక్టర్ ఆకుతోట శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ గా న్యాయవాది  శ్రీమతి భీమనాతి ఉమాదేవి, కోశాధికారిగా నరేందర్ గౌడ్  తెలంగాణ స్టేట్ మేనేజింగ్ కమిటీ సభ్యుడిగా సిరిసిల్ల శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

రెడ్ క్రాస్ సొసైటీ జగిత్యాల జిల్లా శాఖ కు ఈ నెల 24న ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగిసింది. ఇందులో 15 మంది సభ్యులకు 15 సింగిల్ నామినేషన్లు  దాఖలు చేశారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ లో రెడ్ క్రాస్ ఎన్నికల అధికారి సి హెచ్ మనోజ్ కుమార్,  జగిత్యాల శాఖకు 15 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు.


నేపథ్యంలో, ఈ 15 మంది సభ్యుల నుండి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్, వైస్ చైర్మన్, కోశాధికారి, స్టేట్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యుడి పదవులకు  ఒక్కొక్క నామినేషన్ దాఖలు కావడంతో, కమిటీ ఏకగ్రీవం అయినట్లు ఎన్నికల అధికారి మనోజ్ కుమార్ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ధ్రువీకారణ పత్రాలను అందజేసిన అభినందించారు.