👉 వేదిక పాత విద్యుత్తు సబ్ స్టేషన్ 33 K .V ( మొరేల్ల వాగు వద్ద)
J.SURENDER KUMAR,
ధర్మపురి పట్టణ లో మంగళవారం విద్యుత్ వినియోదారుల సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం కొనసాగుతున్నదని స్థానిక విద్యుత్తు శాఖ ADE పి జనార్ధన్ తెలిపారు.
👉 సమయం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1: 00గం వరకు…!
పట్టణంలోని 33 కి.V విద్యుత్ సబ్ స్టేషన్ లో (పాత సబ్ స్టేషన్ మూరెళ్ళ వాగు దగ్గర ) విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక ఏర్పాటు చేశామని ప్రకటనలో పేర్కొన్నారు.
వినియోగదారుల సమస్యల పరిష్కారానికి CGRF -II, చైర్మన్ కె.కిషన్ , సభ్యులు, చైర్ పర్సన్ CGRF -II జె.ఆర్.చవాన్, మెంబర్ టెక్నికల్ మరియు పి శ్రీనివాస్ గ మెంబర్ ఫైనాన్స్ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు.
ధర్మపురి సబ్ డివిజన్ పరిధిలోని ధర్మపురి ,బుగ్గారం, వెలుగటూర్ మరియు ఎండపల్లి మండలాల విద్యుత్ వినియోదారులు వినియోగించుకోవాలని పేర్కొన్నారు..
👉 CGRF అంటే ..!
Consumer Grievances Redressal Forum (వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార ఫోరమ్). ఇది విద్యుత్ వినియోగదారుల సమస్యలను, ఫిర్యాదులను పరిష్కరించడానికి విద్యుత్ చట్టం 2003 (సెక్షన్ 42(5)) ప్రకారం ఏర్పాటు చేయబడిన ఒక ప్రత్యేక సంస్థ.
👉 సమస్యలపై CGRF కి ఫిర్యాదు అంశాలు !
👉 విద్యుత్ బిల్లుల వివాదాలు: తప్పుడు రీడింగ్, అదనపు బిల్లులు రావడం, బిల్లులు అందకపోవడం.
👉మీటర్ సమస్యలు: మీటర్ ఆగిపోవడం (Struck up), కాలిపోవడం, వేగంగా లేదా నెమ్మదిగా తిరగడం.
👉 సరఫరా అంతరాయాలు: తరచూ కరెంట్ పోవడం, పవర్ లైన్ తెగిపోవడం, ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోవడం, వోల్టేజ్ హెచ్చుతగ్గులు.
👉 కొత్త కనెక్షన్ల ఆలస్యం: కొత్త కరెంట్ కనెక్షన్ ఇవ్వడంలో లేదా లోడ్ పెంచడంలో ఆలస్యం.
👉 పేరు మార్పిడి (Title Transfer): కనెక్షన్ వేరొకరి పేరు మీదకు మార్చడంలో సమస్యలు.
👉 ఫిర్యాదు ఎలా చేయాలి ?
మొదటి అడుగు: సమస్య వచ్చినప్పుడు నేరుగా CGRF కి వెళ్లే ముందు, మీ ప్రాంతంలోని విద్యుత్ సబ్‌స్టేషన్, వినియోగదారుల సేవా కేంద్రం (CSC) లేదా టోల్ ఫ్రీ నంబర్ 1912 ద్వారా ఫిర్యాదు చేసి రశీదు (Acknowledgement) తీసుకోవాలి.
👉 CGRF కి ఆశ్రయించడం: అక్కడ నిర్ణీత కాలపరిమితిలో సమస్య పరిష్కారం కాకపోతే, మీరు ఆ రశీదుతో సంబంధిత డిస్కామ్ TGSPDCL వెబ్‌పోర్టల్ లేదా APEPDCL పోర్టల్ వంటి అధికారిక సైట్లలో ఆన్‌లైన్ ద్వారా లేదా CGRF కార్యాలయంలో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చు.
👉 పరిష్కారం కాకపోతే.. ?
ఫిర్యాదు అందిన తర్వాత అధికారులు విచారణ జరిపి చట్టప్రకారం నిర్ణీత రోజుల్లో సమస్యను పరిష్కరిస్తారు. ఒకవేళ CGRF తీర్పుతో కూడా మీరు సంతృప్తి చెందకపోతే ‘విద్యుత్ అంబుడ్స్‌మన్’ (Vidyut Ombudsman) కి అప్పీల్ చేసుకోవచ్చు.
