ట్రాఫిక్‌లో ట్రాన్స్‌జెండర్లు పోలీసుల కొత్త ప్రయోగం !

👉 గణేశ్ నిమజ్జన ట్రాఫిక్ నియంత్రణలో ట్రాన్స్‌జెండర్లు
విధుల్లో 17 మందికి అవకాశం !

👉 హ్యాట్సాఫ్ జగిత్యాల పోలీస్.. !


  J. SURENDER KUMAR,


రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, వయోవృద్ధులు మరియు ట్రాన్స్‌జెండర్ల సాధికారత శాఖల నేపథ్యంలో. జగిత్యాల జిల్లాలో గణేశ్ నిమజ్జన ట్రాఫిక్ నియంత్రణలో ట్రాన్స్‌జెండర్లను జిల్లా పోలీసులు యంత్రాంగం భాగస్వామ్యం చేయడం  ప్రస్తావహనారం.


👉 సమాజంలో సమానత్వం, గౌరవం, వివక్ష రహిత వాతావరణం కోసం జగిత్యాల జిల్లా పోలీసులు వినూత్న ముందడుగు వేశారు. గణేశ్ నిమజ్జనోత్సవ సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణ విధుల్లో ట్రాన్స్‌జెండర్లను భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు.


👉 ఇందులో భాగంగా 17 మంది ట్రాన్స్‌జెండర్లకు నిమజ్జన బందోబస్తులో ట్రాఫిక్ నియంత్రణ విధులు నిర్వహించే అవకాశం కల్పించారు.  ఎస్పీ అశోక్ కుమార్, ఆధ్వర్యంలో  పోలీస్ కార్యాలయంలో ట్రాన్స్‌జెండర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.


👉 ఈ సందర్భంగా విధుల్లో పాల్గొనే 17 మందికి టీ-షర్ట్‌లను అందజేసి, ట్రాఫిక్ నియంత్రణలో పాటించాల్సిన నిబంధనలు, విధి నిర్వహణకు సంబంధించిన పలు సూచనలు, మార్గదర్శకాలను ఎస్పీ అందించారు.


👉 సమాజంలో ఒక వర్గంగా కాకుండా పోలీస్ వ్యవస్థతో కలిసి ప్రజా సేవలో భాగస్వాములయ్యే అవకాశం కల్పించడం ద్వారా ట్రాన్స్‌జెండర్ల పట్ల గౌరవభావాన్ని పెంపొందించడంతో పాటు, వారికి సమాన అవకాశాలు కల్పించాలనే సందేశాన్ని జగిత్యాల పోలీసులు చాటిచెప్పారు.