వినాయకులకు మంత్రి అడ్లూరి ప్రత్యేక పూజలు !


J.SURENDER KUMAR,


వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ధర్మపురి పట్టణంలో పలు ప్రాంతాలలో ఏర్పాటుచేసిన వినాయక విగ్రహాల మండపాలను గురువారం రాత్రి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సందర్శించి వినాయకులకు ప్రత్యేక పూజలు చేశారు.


ఈ సందర్భంగా గణేష్ మండపం నిర్వాహకులు మంత్రికి స్వాగతం పలికి వారి తీర్థప్రసాదాలు శేష వస్త్రం బహుకరించారు.

ఈ సందర్భంగా ధర్మపురి నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని దేవుడిని వేడుకున్నట్లు మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.