J.SURENDER KUMAR,
ప్రజా పాలన – ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిరిసిల్లలో అశేష జనసందోహం మధ్య పట్టణంలోని వీధుల మీదుగా పాదయాత్ర చేశారు. ప్రజలకు అభివాదం చేస్తూ దాదాపు 3 కి.మీ.లకు పైగా ఈ పాదయాత్ర సాగింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చౌరస్తా నుంచి రగుడు ప్రాంతంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ ప్రాంగణం వరకు అశేషంగా తరలివచ్చిన ప్రజలతో కలిసి నడిచారు.

సిరిసిల్ల పట్టణం నడి వీధుల నుంచి సాగిన ఈ పాదయాత్రలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు , పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి , అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ , ఎంపీ వేం నరేందర్ రెడ్డి , ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ప్రజాప్రతినిధులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
